
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం మరింత తీవ్రం అవుతోంది. ఉక్రెయిన్‌లోని ఉత్తర సుమీ ప్రాంతంలోని ఒక రైల్వే స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యన్ దళాలు డ్రోన్లతో దాడి చేశాయి. ఈ దాడి సమయంలో కీవ్‌కు వెళ్తున్న ఒక ప్రయాణికుల రైలుపై బాంబులు పడ్డాయి. ఫలితంగా, రైల్లోని కొన్ని బోగీలు మంటల్లో కాలిపోయాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రాణ నష్టం గురించి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు.