
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్ (ఈసీ) పనితీరుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఐదు ప్రశ్నలతో కూడిన ఒక లేఖను ఈసీకి పంపారు. బీజేపీతో కలిసి ఈసీ దేశంలోని పలు రాష్ట్రాల్లో ఫేక్ ఓటింగ్‌కు పాల్పడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై తీవ్ర అనుమానాలను రేకెత్తించాయి. డిజిటల్ ఓటర్ జాబితాను ఎందుకు దాచిపెడుతున్నారు, సీసీటీవీ ఫుటేజీలను ఎవరి ఆదేశాల మేరకు తొలగిస్తున్నారు అనేవి రాహుల్ లేవనెత్తిన ప్రధాన ప్రశ్నలు.