
పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం (PSP) 2.0లో భాగంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఈ-పాస్‌పోర్ట్‌లను (e-passports) అధికారికంగా ప్రారంభించింది. పాస్‌పోర్ట్ సేవలను మెరుగుపరచడం, భద్రతను పెంచడం, వేగవంతమైన ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్‌ను అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ-పాస్‌పోర్ట్ అనేది సాంప్రదాయ పాస్‌పోర్ట్‌కు ఎలక్ట్రానిక్ వెర్షన్. ఇందులో సురక్షితమైన RFID చిప్ పొందుపరుస్తారు. ఈ చిప్ పాస్‌పోర్ట్ హోల్డర్ ఫోటో, ఫింగర్ ప్రింట్స్, ఇతర వ్యక్తిగత సమాచారంతో సహా బయోమెట్రిక్ డేటాను సురక్షితంగా నిల్వ చేస్తుంది.