
హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి వర్షం తన ప్రతాపాన్ని చూపుతోంది. కుండపోత వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ముఖ్యంగా మైండ్ స్పేస్, ఐకియా, మాదాపూర్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. రాత్రి వేళ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నేపథ్యంలో ‘ఆరెంజ్ అలర్ట్’ జారీచేసింది.