ఇరాన్ దాడిలో కూలిన అమెరికా ఫైటర్ జెట్‌కు చెందిన ఎయిర్‌మ్యాన్ రెండు రోజుల పాటు శతృ భూభాగంలో ఉన్నాడు. అతికష్టంగా 7,000 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడు. చివరకు అతడి లోకేషన్‌ను గుర్తించిన అమెరికా శనివారం అర్ధరాత్రి తర్వాత పలు యుద్ధ విమానాలతో చేపట్టిన సాససోపేత రెస్క్యూమిషన్లో ఆ కల్నల్‌ను రక్షించినట్లు అమెరికా అధికారి తెలిపారు.ఇరాన్ బలగాలను తప్పుదారిపట్టేందుకు సీఐఏ ఒక సైకలాజికల్ వార్ కూడా చేసిందని న్యూయార్క్ టైమ్స్‌కు ఆయన చెప్పారు.

