ఇస్లామాబాద్‌లో దాదాపు 21 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్థాన్ కృషి చేసిందని, ఇరాన్‌తో అనేక కీలక అంశాలపై చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. అయితే చివరకు ఎటువంటి ఏకాభిప్రాయం కుదరకపోవడం విచారకరమని ఆయన అన్నారు. తాము ప్రతిపాదించిన నిబంధనలను అంగీకరించేందుకు ఇరాన్ నిరాకరించిందని, అందుకే ఒప్పందం
లేకుండానే తాము స్వదేశానికి తిరిగి
వెళ్తున్నామని ఆయన తెలిపారు.

