ఇరాన్ ఆయిల్ నిల్వల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయడంపై అమెరికా మండిపడింది. ఏం చేస్తున్నావంటూ ‘డబ్ల్యూటీఎఫ్’ పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తొలిసారి తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్లు యాక్సియోస్ వార్తా సంస్థ పేర్కొంది. ‘వాట్ ద ఫ*’ పదజాలంతో ట్రంప్ ఆగ్రహంతో కూడిన సందేశాన్ని కూడా వైట్‌హౌస్ పంపినట్లు అమెరికా అధికారి తెలిపారు. ఇజ్రాయెల్‌ను ఈ మేరకు ట్రంప్ గట్టిగా హెచ్చరించినట్లు పేర్కొన్నారు.

