పాకిస్తాన్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు మళ్లీ వార్తలు రావడంతో ఆయన పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారని పాక్ సైనికాధికారి తెలిపినా.. అద్వాల జైలు వద్ద భారీ ర్యాలీలు నిర్వహిస్తుండడంతో పాక్ లో ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు భారత్ పై ఉగ్రదాడులు చేసే అవకాశం ఉందని భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది.

