పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఇప్పుడు సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి ‘అన్నా కొణిదెల’గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఖాతా ప్రారంభించగానే అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఆమె ఖాతా ప్రారంభించిన కొద్ది గంటల్లోనే ఫాలోవర్స్ సంఖ్య లక్ష దాటడం విశేషం. మొదటి పోస్ట్ సాధారణ పరిచయంకి సంబంధించింది కాగా , రెండో పోస్టులో భర్త పవన్ కళ్యాణ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. తన బయోలో ‘ రష్మన్ హార్ట్ , ఇండియన్ సోల్ అని పేర్కొన్నారు.

