తెలంగాణ ప్రభుత్వము స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై అమల్లో ఉన్న “రెండు పిల్లల నిబంధన”ను అధికారికంగా రద్దు చేసింది. ఈ నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో ఇది అమల్లోకి వచ్చింది. దీంతో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేసే అవకాశం లభించింది.

