
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ కరాచీ బేకరీపై దాడి జరిగింది. బజరంగ్‌దళ్ కార్యకర్తలు బేకరీ ఫర్నీచర్ ధ్వంసం చేసి, పేరు మార్చాలని హెచ్చరించారు. ఈ దాడులపై కరాచీ బేకరీ యజమాని వారసులు మీడియాతో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో అండగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, కమిషనర్‌లను కోరారు. తాము హైదరాబాద్‌కు చెందిన వారమని.. ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన భారతీయ బ్రాండ్ కాబట్టి.. సాధారణ ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని యజమానులు కోరారు.
- 0 Comments
- Hyderabad
- RangaReddy District