ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలంలోని కోట గ్రామానికి చెందిన లోకండే మారుతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సత్యనారాయణ అనే గుత్తేదారుతో మారుతి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం బేస్మెంట్ వరకు పూర్తయింది.రూ. 1లక్ష లబ్ధిదారు ఖాతాలో ఇటీవల జమ అయింది. బిల్లు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన గుత్తేదారు మంగళవారం సొనాల ప్రయాణ ప్రాంగణంలో మారుతిని తాడుతో చెట్టుకు కట్టేశాడు. తన ఇంటిని నాణ్యంగా నిర్మించలేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. పోలీసులు ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇద్దరూ సైతం పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

