ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్స్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రాహుల్ భాటియా తాత్కాలికంగా సంస్థ బాధ్యతలు చేపట్టారు. భాటియా ప్రస్తుతం ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఇండిగో ఫ్లైట్ రద్దు ఉదంతం తరువాత దాదాపు మూడు నెలలకు పీటర్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న పీటర్ రాజీనామాకు ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ బోర్డు ఆమోదం తెలిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి

