భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, తమ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా అంతర్జాతీయ విమానయాన రంగ నిపుణుడు విలియం వాల్ష్‌ను నియమించింది. మంగళవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్’ (IATA) డైరెక్టర్ జనరల్‌గా సేవలందిస్తున్నారు. విలియం వాల్ష్ రాకతో ఇండిగో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

