సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం గురించి ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో డ్రగ్స్ గురించి ఎక్కువగా వినిపిస్తున్నాయి. మలయాళ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం గురించి నిర్మాత, నటి సాండ్రా థామస్ తీవ్రమైన ఆరోపణలు చేసారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో, సినీ సెట్స్‌లో డ్రగ్స్ వాడకం సర్వసాధారణమైనదని, దీని కోసం ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక గదులు కూడా కేటాయిస్తున్నారని ఆరోపించారు.

