తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్ పరీక్షల తేదీలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. మరోవైపు ఇంటర్ సిలబస్‌లో సమూల మార్పుచేర్పులు చేసింది. ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలోనూ ల్యాబ్స్, ప్రాక్టికల్ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఇంటర్నల్స్‌కు 20 మార్కులు, ఎక్స్టర్నల్ పరీక్షలు 80 మార్కులకు ఉంటుంది.

