
2025 టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభించింది. ఇంగ్లాండ్ వేదికగా ఆడుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత జట్టు 3393 పరుగులు చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఇదివరకూ ఈ ఘనత దక్షిణాఫ్రికా జట్టుతో పేరుతో ఉంది. 2003లో సౌతాఫ్రికా జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో మొత్తం 3088 పరుగులు చేసింది. ఈ రికార్డుతో భారత జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. పరుగుల వర్షం కురిపించిన భారత బ్యాటర్లను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.