కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆసుపత్రిలో చేరారు. జ్వరం, కాళ్ల నొప్పితో బాధపడుతుండటంతో ఆయనను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చేర్పించినట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో వైద్యులు మల్లికార్జున ఖర్గేకు చికిత్స అందిస్తున్నారు. ‘‘మల్లికార్జున ఖర్గేకు జ్వరం వచ్చి కాళ్ల నొప్పి ఉందని ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన క్షేమంగా ఉన్నారు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వైద్యులు పర్యవేక్షిస్తున్నారు’’ అని కాంగ్రెస్ నాయకులు ఒకరు పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.

