బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర, గోవింద బుధవారంనాడు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక్కడి బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న 89 ఏళ్ల ధర్మేంద్ర ఉదయాన్నే ఇంటికి వెళ్లారు. ఆయనకు ఇంట్లోనే చికిత్స అందజేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. మరోవైపు స్వల్ప అనారోగ్యానికి గురైన మరో నటుడు గోవిందా(61) మంగళవారంనాడు రాత్రి కొంత స్పృహ కోల్పోవడంతో క్రిటీ కేర్ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ వైద్యుల పరీక్షల అనంతరం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు.

