
బీఆర్‌ఎస్ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా 27న వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు సంబంధించిన ‘చలో వరంగల్’ పోస్టర్‌ను గురువారం ఆస్ట్రేలియాలో ఆవిష్కరించారు. బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో సిడ్నీ నగరంలోని ఒపేరా హౌస్, హార్బర్ బ్రిడ్జి వద్ద పోస్టర్ ఆవిషరించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలంతా ఈ వేడుకలో పాల్గొంటారని, అలాగే రానున్న రోజుల్లో ఆస్ట్రేలియాలోనూ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు.