కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. మంగళవారం రాత్రి దేశ రాజధానిలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో వైద్యపరీక్షల కోసం చేరారు. డాక్టర్లు ఆమెను అబ్జర్వేషన్ లో ఉంచారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినప్పుడు ఆమె వెంట లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ ఆమె వెంట ఉన్నారు

