్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేర్లు సోమవారం కనిష్ట స్థాయికి పడిపోయాయి. బ్లాక్డీల్ కారణంగా షేర్లు పెద్ద మొత్తంలో చేతులు మారడం, వినియోగదారుల ఫిర్యాదులు, ప్రభుత్వ దర్యాప్తులు, పోటీ పెరగడం, ఆర్థిక నష్టాలు వంటి కారణాల వల్ల షేరు విలువ పడిపోయింది. ఓలా ఎలక్ట్రిక్ షేరు విలువ ప్రారంభంలో రూ. 91.20 వద్ద ఉండగా, ప్రస్తుతం రూ. 43.20కి పడిపోయింది.

