
కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారం గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్‌లో ఫస్ట్ కామనర్‌గా సోల్జర్ పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఆడియన్స్ ఓట్ల ద్వారా ఆయన హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గత మూడేండ్లుగా ఇండియన్ ఆర్మీలో సోల్జర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం స్పెషల్ లీవ్ పై వచ్చి, బిగ్ బాస్ లో అడుగుపెట్టారు. తన సింపుల్ లైఫ్‌స్టైల్, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్‌తో ఇప్పటికే చాలా మందిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే ఫ్యాన్ బేస్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాడు.