పశ్చిమబెంగాల్లోని రాజ్‌భవన్ ప్రాంగణంలో కేంద్ర బలగాలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో సోమవారంనాడు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఈ టీమ్‌లకు నేతృత్వం వహించారు. ముందు జాగ్రత్త చర్యగా రాజ్‌భవన్ భవంతిని పూర్తిగా ఖాళీ చేయించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్, సివిల్ ఢిపెన్స్ టీమ్‌లను కూడా రప్పించారు. ఫైర్‌ఫైటింగ్ డ్రిల్స్ నిర్వహించారు. టీఎంసీ ఎంపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని నిరూపించేందుకే సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చిందని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని గవర్నర్ తెలిపారు.

