
లద్దాఖ్‌లోని లెహ్ లో జరిగిన హింసాకాండ కు భద్రతా బలగాలే కారణమని ఘటన అనంతరం అరెస్టయిన పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ భార్య గీతాంజలి జె ఆంగ్మో ఆరోపించారు. తన భర్తకు పాక్‌తో సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. పూర్తిగా వృత్తిరీత్యా, వాతావరణ అంశాలపై డిస్కషన్ కోసం వాంగ్‌చుక్ పాక్ వెళ్లారని, ఆయన జరిపిన పర్యటలన్నీ ప్రఖాత్య యూనివర్శిటీలు, సంస్థల ఆహ్వానం మేరకే జరిగినట్టు చెప్పారు ‘నిజానికి, ఆ ఈవెంట్‌లో వేదికపై ప్రధానమంత్రి మోదీని ఆయన (వాంగ్‌చుక్) ప్రశంసించారు’ అని ఆమె తెలిపారు.