
హైదరాబాద్‌లో రేపటి నుంచి రెండు రోజులపాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. దీని కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే కార్యక్రమంలో ప్రత్యేక బస్‌లు ఏర్పాటు చేశారు. మృగశిరకార్తెను పురస్కరించుకొని బత్తిన వంశస్తులు ఏటా చేప ప్రసాదం పంపిణీ చేస్తుంటారు. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఈ ప్రసాదం తీసుకుంటే ఆస్తమా కంట్రోల్ అవుతుందనే ప్రచారం చాలా కాలంగా ఉంది.