
పల్నాడు జిల్లా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ పిలుపు మేరకు ఎక్సైజ్ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన ధర్నా సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడారు. ‘ఆడవాళ్లందరూ మందు తాగుతున్నారు. తమ అసలు ప్రవర్తనను ప్రజలకు చూపిస్తున్నారు. ప్రజలు కూడా ఈ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు’ అని అన్నారు. మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.