
ఏపీ లిక్కర్ కేసు లో నిందితుల ఆస్తులను జప్తు చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. రూ.32 కోట్ల ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే జీవో ఇచ్చింది. మద్యం ముడుపుల సొమ్ము ఎలా వసూలు చేశారు.? ఎక్కడికి చేర్చారు.? ఎలా తరలించారు.? అనే కీలక అంశాలన్నింటినీ సిట్ అధికారులు ఇప్పటికే దర్యాప్తులో గుర్తించినట్లుగా చెబుతున్నారు. లిక్కర్ కేసు వ్యవహారంలో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. త్వరలో ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేయనుంది. ఈడీ కూడా ఇప్పటికే కేసులు నమోదు చేసింది.