ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ద కల్పించే బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మ సంతకం చేసి ఆమోదించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా రాష్ట్రపతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. మన రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉండి, దిశానిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎంపీలందరికీ, మా వెన్నంటే నిలిచిన ప్రతి పౌరునికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం, ముఖ్యంగా అమరావతి రైతుల విజయం’అని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

