
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. దరఖాస్తులను ఆదివారం నుంచి (20-04-2025) ప్రారంభమయ్యాయి. మే 15 వరకు దరఖాస్తులు తీసుకుంటారు. హాల్టికెట్లను మే 30 నుంచి జారీ చేస్తారు. డీఎస్సీ పరీక్షలను జూన్ ఆరు నుంచి జులై ఆరు వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని పరీక్షలు పూర్తి అయిన రెండోరోజున ప్రాథమిక కీ విడదల చేస్తారు. అభ్యంతరాలను ఏడు రోజుల్లో స్వీకరిస్తారు. అనంతరం తుది కీ విడుదల చేస్తారు. తుది కీ విడుదల చేసిన ఏడు రోజుల్లో మెరిట్ జాబితాను ప్రకటిస్తారు.