
జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఒకటి ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. ఊహించని విధంగా ఎన్టీఆర్ బాగా సన్నగా మారిపోయారు. ముఖంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. తారక్ బరువు తగ్గడం కోసం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా ? మెడిసిన్ వాడుతున్నారా? అనే చర్చ మొదలైంది. అయితే ఎన్టీఆర్ బరువు తగ్గడం కోసం ఎలాంటి మెడిసిన్ వాడడం లేదని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని టీం నుంచి క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బరువు తగ్గడం కోసం హెల్దీ డైట్ ని మాత్రం ఫాలో అవుతున్నారట.