మీట్ ది ప్రెస్ లో సిఎం రేవంత్, ప్రజాపాలన ప్రారంభమై రెండు సంవత్సరాలైందని తెలిపారు. రాష్ట్రం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందని, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు నిర్ణయాలు హైదరాబాద్ అభివృద్ధికి బాటలు పడ్డాయని ప్రశంసించారు. గతంలో కాంగ్రెస్ హయాం లోనే అనేక కేంద్ర సంస్థలు హైదరాబాద్ ఏర్పాటు చేశారన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మార్చి నిధులు కొల్లగొట్టిందని, గతంలో నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కిన పరిస్థితులు ఉండేవన్నారు.

