మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల అక్రమణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీడియో విడుదల చేశారు. భూముల అక్రమణపై జనసేనే పార్టీ యూ ట్యూబ్ లో వీడియోను ఉప ముఖ్యమంత్రి పవన్ అప్ లోడ్ చేశారు.
ఇటీవల కుంకీ ఏనుగుల సందర్శన సమయంలో ఏరియల్ సర్వే నిర్వహించి పవన్ వీడియో తీసి విడుదల చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలలో అక్రమణకు గురైందని, విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు పవన్ ఆదేశించారు.

