మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా చంద్రబాబుపై విమర్శలు చేశారు. ‘చంద్రబాబుగారూ.. మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం సేకరించకుండా.. ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా.. ఒక్కపైసా ఖర్చుచేయకుండా.. ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకుండా. “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది అని విమర్శించారు.

