భారత్, శ్రీలంక T20 World Cup 2026 టోర్నీకి ఇరుదేశాల్లోని వేదికలు ప్రధాన నగరాలైన అహ్మదాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, ముంబైలో వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఎంపిక చేసింది. శ్రీలంక విషయానికొస్తే.. కొలంబో, క్యాండీ టోర్నీకి వేదిక కానున్నాయి. ఫిబ్రవరి 7న జరుగబోయే ఆరంభ పోరుకు వేదికైన అహ్మదాబాద్‌లోనే మార్చి 8న ఫైనల్ జరుగనుంది. అయితే.. బీసీసీఐ, పాక్ బోర్డు అంగీకరించినందున పాకిస్థాన్ జట్టు మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో ఆడించనున్నారు. ఒకవేళ పాక్ టీమ్ ఫైనల్ చేరితే అహ్మదాబాద్‌లో కాకుండా మ్యాచ్ నిర్వహించడం ఖాయం.

