అమరావతి రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొనసాగిస్తున్న అవినీతిని చట్టబద్ధత చేసుకోవడం కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో చేస్తున్న దోపిడీనే ప్రశ్నిస్తున్నామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే కోసమే అసెంబ్లీ సమావేశం పెట్టారు. మరోసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్న భయం వాళ్లలో స్పష్టంగా కనిపిస్తోందిఅని అన్నారు

