ఇరాన్ అంతటా నిరసనలు విస్తరిస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరసనకారుల వాదనలు వినేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే కొంతమంది అల్లరి మూకలు మొత్తం సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అదే విధంగా ఇరాన్లో జరుగుతున్న నిరసనల్లో ఇప్పటివరకు దాదాపు 203మంది చనిపోయినట్లు వార్త కథనాలు వెలువడ్డాయి. మృతుల్లో 162 మంది నిరసనకారులు ఉండగా, 41 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.

