వర్షపు నీటి విలువ రాయలసీమ రైతులకు బాగా తెలుసని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ తెచ్చామని, రాయితీతో పరికరాలు ఇచ్చామని అన్నారు. సాగునీటి సంఘాలకు వంద రోజుల ప్రణాళిక ఇచ్చేలా సిఎం దిశానిర్దేశం చేశారు. సాగునీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. నీరు సమృద్ధిగా ఉంటేనే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని, దేశంలో ఎక్కువ పళ్లు, కూరగాయలు పండే జిల్లాగా అనంతపురాన్ని మారుస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

