
ఋతుపవనాల రాక తర్వాత అరేబియా సముద్రంలో ఈ సీజన్లో తొలి అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఈ కారణంగా రానున్న 36 గంటల్లో కేరళ, కర్ణాటక, గోవాలో అతి భారీ వర్షాలు, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోనున్నట్టు తెలియజేసింది. కాగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో ఈనెల 26, 27న ఏపీలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.