పంతొమ్మిదో సీజన్లో ఛేజింగ్ జట్టుకు మరో విజయం. తొలిపోరులో గుజరాత్ టైటాన్స్‌కు చెక్ పెట్టిన పంజాబ్ కింగ్స్ ఈసారి చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. భారీ స్కోర్ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్(50)కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(43), ప్రియాన్ష్ ఆర్య(39)లు దంచేశారు. ఫలితంగా పంజాబ్ వరసగా రెండో విజయం నమోదు చేయగా.. సొంత మైదానంలో గెలిచి బోణీ కొట్టాలనుకున్న సూపర్ కింగ్స్‌కు నిరాశే మిగిలింది.

