అయోధ్య రామాలయ ప్రాంగణంలో శుక్రవారం నమాజ్ చేయడానికి ప్రయత్నించిన కశ్మీర్‌కు చెందిన అహ్మద్ షేక్ (55)ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని అదుపు లోకి తీసుకున్నారు. స్థానికులు,మీడియా కథనాల ప్రకారం అహ్మద్ షేక్ రామాలయ ప్రాంగణం లోని సీతారసోయి ప్రాంతంలో నమాజ్ చేయడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ అతడు దేవాలయం లోకి ఎలా ప్రవేశించాడు? అతడితోపాటు ఇంకెవరైనా ఉన్నారా ? అని ఆరా తీస్తున్నారు.

