
మేడ్చల్ జిల్లా గండిమైసమ్మ చౌరస్తా నివాసం ఉంటున్న శ్రీనివాస్ వర్మ కుమార్తె శ్రీజా వర్మ… ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. కొన్నాళ్ల క్రితమే ఎంఎస్ పూర్తి చేసి.. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. సోమవారం నాడు రాత్రి తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన శ్రీజా వర్మ భోజనం చేయడం కోసం కారులో రెస్టారెంట్‌కు వెళ్లింది. తిన్న తర్వాత తిరిగి తన అపార్ట్‌మెంట్‌కు తిరిగి వస్తుండగా.. ఆమె కారుని ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈప్రమాదంలో శ్రీజా వర్మ తీవ్రంగా గాయపడి చనిపోయింది.