
చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో భారత సంతతికి చెందిన పైలట్‌ను అరెస్ట్ చేశారు. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన కో-పైలట్ రుస్తమ్ భగ్వాగర్ (34)ను చిన్నారిపై లైంగిక దాడి కేసులో అరెస్ట్ చేశారు. విమానం ల్యాండ్ అయిన 10 నిమిషాల్లోనే 10 మంది హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు విమానంలోకి ప్రవేశించారు. తుపాకులు, బ్యాడ్జీలు ధరించి కాక్‌పిట్‌లోకి ప్రవేశించి రుస్తమ్‌కు హ్యాండ్ కఫ్ వేసి బయటకు తీసుకెళ్లారు. ప్రయాణికులు ఇంకా దిగకముందే ఘటన చోటుచేసుకుంది.