పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల మధ్య ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా పంపిన 15 అంశాల ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. తమ షరతులు నెరవేరే వరకు అమెరికాకు బిగ్ షాకులు ఇస్తూనే ఉంటామని శపథం చేసింది. ఇరాన్ సీనియర్ అధికారులు ప్రెస్ టీవీతో మాట్లాడుతూ.. అమెరికా తమను రెండుసార్లు మోసం చేసిందని ఆరోపించారు. వాషింగ్టన్కు శాంతి పట్ల నిజమైన ఉద్దేశం లేదని, కేవలం తమ ప్రయోజనాల కోసమే ఈ ప్రతిపాదనలు చేస్తోందని టెహ్రాన్ తెలిపింది.

