పశ్చిమాసియాతో ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్న వేళ తమపై విదేశీ దాడి జరిగితే పాకిస్థాన్ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని భారత్ లో పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయి. ఒకవేళ అమెరికా పాకిస్థాన్‌పై దాడి చేస్తే, తాము రెండో ఆలోచన లేకుండా ముంబై, న్యూఢిల్లీపై దాడి చేయాల్సి ఉంటుందని, తాము దాన్ని వదిలిపెట్టబోమని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామంటూ బాసిత్ వ్యాఖ్యానించాడు.

