మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మచిలీపట్నం- విజయవాడ- గుంటూరు (మావిగన్) ప్రాంతాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలని సూచించారు. నిజానికి- మావిగన్ తరహా కనెక్టెడ్ ఇండస్ట్రీయల్ కారిడార్ సిటీలు చాలానే ఉన్నాయి ఇతర దేశాల్లో. చైనాలో బీజింగ్-టియాంజిన్-హెబీ లను కలుపుతూ జింగ్-జిన్-జీ పేరుతో ఇండస్ట్రీయల్ కారిడార్ , అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా,బోస్టన్- వాషింగ్టన్ డీసీ సైతం మావిగన్ వంటిదే. జపాన్ లో రాజధాని టోక్యో బే ఏరియా నుండి పోర్ట్ సిటీ యోకోహామాను కలిపే కారిడార్ ఇది.

