ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మహ్మద్ సఫా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అణు దాడులు చేసేందుకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ వినాశనానికి సాక్ష్యంగా ఉండలేకనే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఐక్యరాజ్యసమితిలోని కొందరు కీలక నేతలు కూడా ఈ దాడులకు మద్దతు ఇస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

