బంగాల్ కోల్కతాలోని ఐ-ప్యాక్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్-ED దాడులను నిరసిస్తూ దిల్లీలో తృణమూల్ కాంగ్రెస్-TMC ఎంపీలు ఆందోళన చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ దిల్లీలోని కేంద్రహోం మంత్రి అమిత్ షా కార్యాలయం వద్ద TMC ఎంపీలు నిరసనలు చేశారు. డెరెక్ ఓబ్రియెన్, మహువా మొయిత్రాతో సహా మరికొంత మంది ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఫ్లకార్డులు పట్టుకొని అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన చేస్తున్న ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.

