రాజధాని ప్రాంత రైతుల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు వారి సమస్యలపై కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అందుకే రైతుల సమస్యల పరిష్కారానికి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ కుమార్ ముగ్గురు సభ్యులతో కమిటీ వేసింది. రాజధాని ప్రాంత రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ సమావేశమైంది. రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంకా పరిష్కారం కాని ఇష్యూలను వివరించారు ఒకేసారి అన్ని సమస్యలకు పరిష్కారం లభించదని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు కమిటీ సభ్యులు వివరించారు.

