ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, కూటమి ఎంపీల బృందంతో కలిసి న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.లోక్సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో, మంత్రి నారా లోకేశ్, ఏపీ కూటమి ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు.

